15 ఏళ్ల బాలికకు 39 ఏళ్ల వ్యక్తితో వివాహం
పదిహేనేళ్ల బాలికను, 39 ఏళ్ల వయస్సు గల దివ్యాంగుడికి ఇచ్చి పెళ్లిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలం పూడూర్లో జరిగిన ఈ బాల్యవివాహానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
15 ఏళ్ల బాలికకు 39 ఏళ్ల వ్యక్తితో వివాహం
మేడ్చల్ మండలం పూడూర్లో జరిగిన బాల్యవివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూడూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను రావల్కోల్ గ్రామానికి చెందిన 39 ఏళ్ల వయస్సుగల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఐసీడీఎస్ అధికారులకు కూడా సమాచారం లేదని వెల్లడించారు.