యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడానికి చెందిన పిండి శ్రీశైలం, స్వప్న దంపతులకు ఏడాదిన్నర కూతురు మనుశ్రీ ఉంది. దసరా పండుగకు స్వప్న అమ్మగారి గ్రామమైన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురానికి భర్త శ్రీశైలం, కూతురు మనుశ్రీతో కలిసి వచ్చారు.
ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి చిన్నారి మృతి - శాలిగౌరారం
ప్రాణంగా చూసుకుంటున్న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి.. మృతి చెందిన విషాదకర ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురంలో చోటుచేసుకుంది.
నీటి సంపులో పడి చిన్నారి మృతి
గురువారం అమ్మమ్మ ఇంటి ఆవరణలో చిన్నారులతో ఆడుకుంటున్న క్రమంలో మనుశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మనుశ్రీ మృతదేహాన్ని స్వగ్రామమైన దత్తప్పగూడానికి తీసుకెళ్లి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:ఇల్లందులో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
Last Updated : Oct 30, 2020, 6:44 PM IST