తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: గృహ ప్రవేశం జరిగే ఇంట... చిన్నారి మృత్యు ఒడికి! - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు

కొత్త ఇంట్లో సంతోషంగా అడుగుపెట్టాలనుకున్న ఆ ఇంట తీరని విషాదం నిండింది. గృహ ప్రవేశం వేడుక కోసం అన్ని సిద్ధం చేసుకున్న కుటుంబంలో శోకమే మిగిలింది. కొత్త ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరింది.

child died with car accident in nizamabad
విషాదం: గృహ ప్రవేశం జరిగే ఇంట... చిన్నారి మృత్యు ఒడికి!

By

Published : Nov 25, 2020, 6:49 PM IST

నిజామాబాద్ జిల్లా భీంగల్‌ మండలం చేంగల్‌లో విషాదం చోటుచేసుకుంది. కొత్త ఇల్లు కట్టుకొని... సంతోషంగా గృహప్రవేశం చేద్దాం అనుకున్న ఓ కుటుంబానికి శోకమే మిగిలింది. నూతన ఇంటి వేడుక కోసం అన్ని సిద్ధం చేసుకున్న కుటుంబంలో కారు రూపంలో చిన్నారిని మృత్యువు కబళించింది.

కొత్త ఇల్లు ముందు ఆడుకుంటున్న చిన్నారి వైష్ణవిని కారు ఢీకొంది. వారి బంధువులే కారు అజాగ్రత్తగా నడపడంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. సంతోషంగా గృహ ప్రవేశం జరపాలనుకున్న ఆ ఇంట ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:కల నెరవేరలేదని తనువు చాలించాడు...

ABOUT THE AUTHOR

...view details