తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. బలి తీసుకున్న ఆటో - ఏపీ నేర వార్తలు

పిల్లల కోసం ఆ దంపతులు సంప్రదించని వైద్యులు లేరు.. మొక్కని దేవుడు లేడు... అలాంటి వారికి 20ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. లేకలేక పుట్టిన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి వక్రీకరించింది. పట్టుమని నాలుగేళ్లు కూడా నిండకుండానే ఆ పాపను మృత్యువు ఆటో రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో జరిగింది.

పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. బలి తీసుకున్న ఆటో
పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. బలి తీసుకున్న ఆటో

By

Published : Jan 10, 2021, 11:57 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో విషాదం జరిగింది. ఆటో ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ కుమార్తె శృతి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా.. ఆటో ఢీకొట్టింది.

ఘటనలో శృతి అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ దంపతులకు.. శృతి 20 ఏళ్ల తర్వాత పుట్టింది. చిన్నారి మృతితోో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంజామల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:జేబుదొంగ దారుణ హత్య... మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి

ABOUT THE AUTHOR

...view details