సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకుని చైన్ స్నాచింగ్ చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన గొల్లపల్లి రామకృష్ణ(37).. గతంలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేశాడు. ఉద్యోగం పోగొట్టుకున్న అతను జల్సాలకు బానిసై డబ్బుల కోసం బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు.
అప్పట్లో సాఫ్ట్వేర్.. ఇప్పడు చైన్ స్నాచర్ - చిక్కడపల్లి పీఎస్ వార్తలు
ఉన్నత చదువులు చదివి మంచి కొలువు సంపాదించాడు. కానీ అందులో ప్రతిభ చూపించలేకపోయాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఖాళీగా ఉన్న అతను జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఓ మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి నిర్వాకం ఇది.

చిక్కడపల్లి, చైన్ స్నాచింగ్‌లు
ఈ నెల 7న అశోక్‌నగర్‌లో పండ్లు కొనుగోలు చేస్తున్న మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును రామకృష్ణ అపహరించి పారిపోయాడు. అనంతరం బాధితురాలు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. రామకృష్ణ నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:పెళ్లి కాలేదని యువతి ఆత్మహత్య