తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి - jayaram murder case in supreme
12:00 December 08
తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడు రాకేశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం... బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జయరాం హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. ఆరోపణలు ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులపై బెయిలబుల్, ఇతరులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- ఇదీ చూడండి :ఏలూరు: చిన్నారులనూ వదలని వింత వ్యాధి