తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం.. గ్రామస్థుల్లో ఆందోళన - రామాపురంలో చిరుత సంచారం వార్తలు

సంగారెడ్డి జిల్లా అల్మైపేట్​లో చిరుత పులుల సంచారం కలవరం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పులి పంజా గుర్తుల ఫొటోలను అటవీశాఖ అధికారులకు పంపించారు.

cheetah appears at ramapuram in sangareddy district
సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

By

Published : Jun 15, 2020, 10:28 AM IST

Updated : Jun 15, 2020, 11:20 AM IST

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మైపేట్​ గ్రామ శివారులో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కిష్టయ్య కొన్నాళ్లుగా గ్రామ శివారులోని విద్యుత్ ఉపకేంద్రం పక్కనే ఉన్న పొలానికి కాపలాదారుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో కిష్టయ్య, అతని స్నేహితులు విశ్వనాథం గౌడ్​, దశరథ్​లు పొలం వద్ద ఉన్న గది ముందు కూర్చున్నారు. పక్కన ఏదో అలికిడి కావడం వల్ల చరవాణి లైట్ వేసి చూశారు. చిరుత కనిపించటంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

రాత్రి 11:30 గంటల సమయంలో మరోసారి చప్పుడు కావడం వల్ల కిటికీలోంచి చూడగా.. తల్లితో పాటు రెండు చిరుత పిల్లలను చూసినట్టు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జోగిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

పులి పంజా గుర్తుల ఫొటోలు తీసి అటవీశాఖ అధికారులకు పంపించినట్లు ఎస్సై ప్రభాకర్ పేర్కొన్నారు. ఆ గుర్తులు అడవిపిల్లికి సంబంధించినవిగా ఉన్నాయని.. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని అటవీశాఖ అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.

ఇదీచూడండి: గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రంలో చిరుత?

Last Updated : Jun 15, 2020, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details