అక్రమ కేసులు పెడతానంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్న మెదక్ జిల్లా ఎస్సైపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చీలపల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండలం చీలపల్లి గ్రామం మధ్యలో నిర్మిస్తున్న స్మశాన వాటికను వ్యతిరేకిస్తూ... హైకోర్టును ఆశ్రయించినట్లు గ్రామస్థులు కమిషన్కు వివరించారు.
ఎస్సైపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో గ్రామస్థుల ఫిర్యాదు - Cheelapally villagers complaint against the Medak district SI
మెదక్ జిల్లా ఎస్సైపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చీలపల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెడతానంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.
ఎస్సైపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో గ్రామస్థుల ఫిర్యాదు
హైకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ... స్థానిక అధికార పార్టీ సర్పంచ్, ఎంపీటీసీల ప్రోద్భలంతో... పెద్ద శంకర్ పేట పీఎస్ ఎస్సై సత్యనారాయణ తమపై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధిస్తున్న ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని... చీలపల్లి గ్రామస్థులు హెచ్చార్సీని వేడుకున్నారు.
ఇదీ చదవండి:'రాజ్యసభకే అవమానకరమైన రోజు ఇది'