తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ రమ్మీ యాప్​తో మోసం.. పోలీసులకు చిక్కిన వైనం

సులభంగా డబ్బు సంపాదించడానికి యువత పెడదారి పడుతున్నారు. జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆన్​లైన్ రమ్మీ యాప్​తో పలువుర్ని మోసం చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Online rummy applications
ఆన్​లైన్​ రమ్మీ యాప్​తో మోసం

By

Published : Sep 26, 2020, 5:12 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్​ గ్రామానికి చెందిన పుత్తూరు శ్రీనివాస్ గుట్కా వ్యాపారం నిర్వహించేవాడు. గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు పెరగడం వల్ల దందాను మూసివేశాడు. కొంత మంది యువకులతో చేరి ఆన్​లైన్ రమ్మీ ఆట మొదలుపెట్టాడు. విలాసవంతమైన భవనంలో క్యూఆర్​ కోడ్ స్కానర్​తో, తన బ్యాంక్ అకౌంట్​లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేశాడు.

రామగుండం డీసీపీ అశోక్ కుమార్

ఇలా ఎంతో మంది ఆన్​లైన్ రమ్మీ ఆట ద్వారా శ్రీకాంత్ మోసగించాడని రామగుండం డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. రాజస్థాన్​ జైపూర్​లో రమ్మీ ఫ్యామిలీ పేరిట యాప్​ను తయారు చేసి లైసెన్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు మూడు కోట్ల వరకు నగదు చేతులు మారిందని చెప్పారు. దీనిపై విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

శ్రీకాంత్​తో పాటు సాయి తేజ, సందీప్, మహమూద్ హజ్రత్, అంజిలను అరెస్టు చేసినట్లు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. వారి నుంచి నాలుగు సెల్​ఫోన్లు, మల్టీ ఛార్జర్ సాకెట్లు, స్కానర్​ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగ యాప్​లను నమ్మి యువత మోసపోకూడదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details