ఎస్సై పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి... రూ.లక్ష మేర హెడ్ కానిస్టేబుల్‌ను బురిడీ కొట్టించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఇందిరానాయక్ నగర్‌లో వెలుగు చూసింది. సిటీగార్డ్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇసుకపల్లి బాలగురుప్రసాద్‌రెడ్డికి... ఈ నెల 11న తనకు బాగా పరిచయం ఉన్న జయన్న అనే సబ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఐడీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆయనతో కాసేపు గురుప్రసాద్‌రెడ్డి చాటింగ్ చేశారు.
తనకు రూ.లక్ష అవసరమని, డబ్బులు పంపు, సాధ్యమైనంత త్వరగా తిరిగిచ్చేస్తానని ఎదుటి వ్యక్తి బ్యాంకు ఖాతా పంపాడు. నగదు పంపేందుకు సిద్ధమైన గురుప్రసాద్‌రెడ్ఢి... ఒకసారి మాట్లాడదామని ఎస్సైకి ఫోన్ చేయగా, అది పనిచేయలేదు. అయినా... తనకు బాగా తెలిసిన ఎస్సై అయ్యేసరికి రూ.లక్షను రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత రూ.లక్ష అందాయా లేదా అని తెలుసుకునేందుకు ఎస్సై జయన్నకు ఫోన్ చేయగా, డబ్బు ఏంటంటూ ఎస్సై ప్రశ్నించాడు.