గొలుసు కట్టు విధానం ముసుగులో అధిక వడ్డీలు ఇస్తామంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని హైదరాబాద్ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఈ మోసం బయటపడింది.
అధిక వడ్డీలు ఇస్తామంటూ హద్మన్లాల్ కుమావత్ అనే వ్యక్తి , మరో ఇద్దరు కలిసి 'హైపర్ నెక్స్ట్' అనే కంపెనీని ప్రారంభించాడు. ఆన్లైన్లో కార్యాలయ వ్యవహారాలని నడిపించాడు. సులభంగా డబ్బు గడించాలనే ఆశతో ప్రజలకు మాయ మాటలు చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు. మొదట్లో వడ్డీలు ఇచ్చి, స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కస్టమర్ల ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహిచారు.