తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఫేస్​బుక్​ ద్వారా పరిచయం... ప్రేమ పేరుతో మోసం

ఫేస్​బుక్ ద్వారా పరిచమయ్యారు. తర్వాత దగ్గరయ్యారు. పరిచయం కాస్తా ప్రేమలా చిగురించింది. కష్టాసుఖాలను పంచుకున్నారు. అమ్మాయి కష్టాల్లో పాలు పంచుకుంటానని... హామీ ఇచ్చాడు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకాడని సర్వం అర్పించుకుంది. అంతే కట్ చేస్తే... ప్రబుద్ధుడు ప్లేట్ ఫిరాయించాడు. అమ్మాయిని దూరం పెట్టి భార్యతో కలిసి బెదిరింపులకు దిగాడు.

ఫేస్​బుక్​ ద్వార పరిచయం... ప్రేమ పేరుతో మోసం
ఫేస్​బుక్​ ద్వార పరిచయం... ప్రేమ పేరుతో మోసం

By

Published : Dec 30, 2020, 8:38 PM IST

ఓ సంగీత ఉపాధ్యాయురాలిని ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న యువతికి ఫేస్‌బుక్‌లో బంజారాహిల్స్‌కు చెందిన కరణ్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. యువతి ఆర్థిక సమస్యలు తీరుస్తానని ఆమెను లోబరుచుకున్నట్టు... బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఆ తర్వాత తన ఫోన్‌ నెంబర్లను కరణ్‌రెడ్డి బ్లాక్‌ చేసుకున్నాడు. భార్యతో కలిసి యువతిని బెదిరించగా... బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఉస్మానియా క్యాంపస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... జీరో ఎఫ్‌ఐర్‌ కింద కేసును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు కరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details