తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో మోసం.. 450 మందికి టోకరా - Fraud in private jobs in GHMC

జీహెచ్‌ఎంసీతోపాటు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 450 మంది నుంచి కోటి రుపాయల వరకు తీసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.

Cheating in the name of ghmc jobs Tokara for 450 people in hyderabad
ఉద్యోగాల పేరుతో మోసం.. 450 మందికి టోకరా

By

Published : Dec 18, 2020, 2:09 PM IST

జీహెచ్ఎంసీతోపాటు పలు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ మూడులోని ఎక్సోర సంస్థలో గంగాధర్ ఆపరేషనల్ మేనేజర్​గా, మహేందర్ హెచ్ఆర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ జీహెచ్ఎంసీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రచారం ప్రారంభించారు. దానికి అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. సంస్థ తరపున ఐడీకార్డులు ఇచ్చారు.

కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారు. ఇలా 450 మంది నుంచి రూ.కోటి వరకు కొల్లగొట్టారని బ్యాంకు లావాదేవీల ద్వారా పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో పలువురు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి :నడిరోడ్డుపై తగలబడిన కారు.. వీడియో ఇదిగో..!

ABOUT THE AUTHOR

...view details