ఉన్నత చదువు చదివి సక్రమమైన మార్గంలో నడవాల్సిన వ్యక్తి.. ఉద్యోగాల పేరుతో దాదాపుగా 2000 మందిని మోసం చేశాడు. సుమారు రూ.30లక్షల వరకు కాజేసిన ఆ వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద లక్ష రూపాయల నగదు, రెండు ఫోన్లు, మూడు క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాకు చెందిన షేక్ సిద్ధ సాహెబ్ 2012లో ఎంబీఏ పూర్తి చేశాడు. నగరంలోని మల్కాజిగిరిలో ఉంటూ స్నేహితుడితో కలిసి కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. తన భార్యను టెలీకాలర్‌గా పెట్టుకున్నాడు. పేపర్లో చిన్నచిన్న ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చి ఒక్కొక్కరివద్ద సుమారు రూ.1000 నుంచి 2వేల వరకు వసూలు చేశాడు.