ఉదయ్‌శంకర్ పారుపల్లిపై రూ. 90.65లక్షలు మోసం చేసినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. మే 22న రెండు లక్షల 3ఎం ఎన్95 8310 మోడల్ మాస్కులను డాక్టర్ చంద్రమోహన్ డ్యూక్ కంపెనీ బిష్కేక్, కిర్గిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా తన ఫార్మా కంపెనీ ఖాతాలోకి 20 శాతం మొత్తాన్ని జమ చేయాలని ఉదయ్‌శంకర్ తెలిపారని.. అతన్ని నమ్ముతూ తాను వివిధ తేదీల్లో డబ్బును జమచేసినట్లు చంద్రమోహన్ ఫిర్యాదులో తెలిపారు.
తేదీ | జమ చేసిన డబ్బులు (రూ. లలో) |
31 మే | 2,00,000 |
01 జూన్ | 12,00,000 |
22 జూన్ | 57,34,824 |
02 జులై | 19,30,337(25.000 యూఎస్ డాలర్లు) |
మొత్తం | 90,65,161 |