తీసుకున్న డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడనే కోపంతో స్నేహితున్నే హతమార్చారు తోటి స్నేహితులు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక శివాజీ నగర్‌కు చెందిన విశాల్, బాబా నగర్‌కు చెందిన నసీర్, జయిద్ స్నేహితులు. విశాల్ తన స్నేహితుల వద్ద డబ్బు తీసుకొని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని కక్ష కట్టిన నసీర్, జయిద్లు.. మరి కొందరితో కలిసి పార్టీ చేసుకుందామని పిలిచారు. గత నెల 28, 29 మధ్య రాత్రి విశాల్‌ను ఓ కార్లో జహీరాబాద్ సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.
తన కుమారుడు కనిపించడం లేదని విశాల్ తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విశాల్ అడవిలో హత్యకు గురయినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విశాల్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు.