ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు... మరో 9 హత్యలు చేసిన రాక్షసుడు సంజయ్ కుమార్ యాదవ్. ఈ హత్యలకు సంబంధించిన సాంకేతిక సాక్ష్యాలు వెల్లడైయ్యాయి. కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది. గత నెల 20న సంజయ్ కుమార్ యాదవ్ వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలోని మక్సూద్ అతని కుటుంబ సభ్యులను, పక్కనే నివసిస్తున్న ఇద్దరు బీహారీ యువకులు.. మొత్తం 9 మందికి మత్తుపదార్థాలు ఇచ్చి బావిలో పడేశాడు.
30 రోజుల్లోపే చార్జ్ షీట్
సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని వేగంగా దర్యాప్తు చేశారు. నిందితుడిని పట్టుకున్నారు. ఫోరెన్సిక్ నివేదిక రావడం వల్ల నిందితుడికి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం పోలీసులకు లభించినట్లైంది. వెంటనే పోలీసులు కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును సమగ్రంగా పరిశోధించి.. 30 రోజుల్లోపే చార్జ్ షీట్ దాఖలు చేశామని... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.