పొలానికి వెళ్తున్న మహిళ కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును అపహరించుకుపోయారు దుండగులు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన ఎల్లమ్మను ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొల్లాపూర్‌కు ఎటు వెళ్లాలని అడిగి ఆమెను మోసగించారు.
మహిళ మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు - వనపర్తి జిల్లా తాజా సమాచారం
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన మహిళ మెడలో పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మహిళ పొలానికి వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కళ్లలో కారం చల్లి దొంగతనానికి పాల్పడ్డారు.
మహిళ మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
బాధితురాలు తేరుకునేలోపే దొంగలు ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వహీద్ అలీబేగ్ వెల్లడించారు.