చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు..16 తులాల బంగారం స్వాధీనం - నిజామాబాద్ జిల్లా వార్తలు
13:23 October 11
నిజామాబాద్‌లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు.. 16 తులాల బంగారం స్వాధీనం
నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని 3,4 టౌన్ల పరిధిలో గత కొద్ది రోజులుగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
నిందితుల నుంచి 16 తులాల బంగారం, నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి