విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు మహ్మద్ హసీబ్ అహ్మద్, అహ్మద్ సులేమాన్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి, హుమయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, చాదర్‌ఘాట్ పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులిద్దరిని పట్టుకున్నారని ఇన్‌స్పెక్టర్ జావేద్ తెలిపారు. నకిలీ వీసాలు తయారు చేస్తున్న బరోడావాసి షా వర్షల్ పారిపోయాడని, ఇప్పటివరకు ఈ ముగ్గురు 20 మందిని మోసం చేశారని, రూ.30 లక్షలు వసూలు చేసుకున్నారని వివరించారు.
అలాగైతే సులువుగా పడిపోతారని..
బజార్‌ఘాట్‌లో ఉంటున్న మహ్మద్ హసీబ్ ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మెహిదీపట్నంలో మహఫూజ్ టూర్స్, ట్రావెల్స్‌లో మేనేజర్ అహ్మద్ సులేమాన్ పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి దుబాయ్, కువైట్‌లకు వెళ్లే వారి నుంచి కమీషన్ తీసుకుని టిక్కెట్లు ఇచ్చేవారు. ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్‌లోని బరోడాకు చెందిన షా వర్షల్ ఫోన్ ద్వారా పరిచయయ్యాడు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేద్దామని, రూ.లక్షలు సంపాదించవచ్చని చెప్పాడు. ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి పథకాన్ని వివరించాడు.