ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సహాయం కోరినట్లు నటించి.. అమాయకులను బురిడీ కొట్టించారు. గునుపూడికి చెందిన బంగార్రాజు.. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రైతు బజార్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఒక యువకుడు బైక్ పై వచ్చి.. బైక్ స్టాండ్ వేస్తూ.. పడిపోతున్నట్లు నటించాడు. అటుగా వస్తోన్న బంగార్రాజు ఆ యువకుణ్ని.. పైకి లేపి ప్రయత్నం చేస్తుండగా.. వెంటనే మరో యువకుడు అక్కడికి వచ్చాడు. అతనికి సాయం చేస్తున్నట్లు.. ఒక పేపర్ అడ్డుపెట్టి బంగార్రాజుపై జేబులో ఉన్న సెల్ ఫోన్ దొంగిలించి.. ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
రోడ్డుపై పడిపోయినట్లు నటిస్తారు.. సెల్ కాజేస్తారు.! - భీమవరంలో దొంగతనాలు తాజా వార్తలు
బైక్‌పై వెళ్తూ పడిపోయినట్లు నటించి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు దుండగులు. సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఏపీలోని భీమవరం ఒకటి, రెండు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకే తరహా దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పడిపోయినట్లు నటిస్తారు... సెల్ కాజేస్తారు
ఈ దృశ్యాలన్నీ.. అక్కడ ఎదురుగా భవనంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటిని తీసుకుని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో ఆ ఇద్దరు దొంగలే.. రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:గన్తో బెదిరించి... అత్యాచారం చేసి... రికార్డు చేశాడు
Last Updated : Dec 22, 2020, 7:10 PM IST