ఏపీ గుంటూరులో జరిగిన సెల్‌ఫోన్ కంటైనర్ చోరీ కేసును పోలీసులు 2 వారాల వ్యవధిలో ఛేదించారు. మధ్యప్రదేశ్‌లో గస్తీ నిర్వహించిన పోలీసులు... అత్యంత ప్రమాదకరమైన కంజర్‌భట్ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద గుంటూరు చోరీకి సంబంధించిన సరకు, నగదుతో పాటు.. మెదక్ జిల్లా చేగుంట చోరీకి సంబంధించిన సొత్తునూ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో చోరీకి గురైన 960 సెల్ఫోన్లలో 862 స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ: సెల్‌ఫోన్ కంటైనర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు - గుంటూరులో సెల్‌ఫోన్ దొంగలు అరెస్ట్
ఏపీ గుంటూరులో జరిగిన సెల్‌ఫోన్ కంటైనర్ చోరీ కేసును పోలీసులు 2 వారాల వ్యవధిలో ఛేదించారు. కంజర్‌భట్ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన సరకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మంది నిందితులు ఉన్నారని.. మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
చిత్తూరు జిల్లా నగరిలోనూ దొంగతనం చేసింది కంజర్‌భట్‌కు చెందిన వారేనని... అయితే రెండింటి శైలి వేరని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు. చోరీలో 11 మంది నిందితులుండగా... ఇద్దరిని పట్టుకున్నామని మిగతా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిందితుల అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు. సెల్ఫోన్లు తరలించే కంపెనీలు ఇకపై రవాణాలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. కంటైనర్ల వెనుక సీసీ కెమెరాలు అమర్చుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి:హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ