రుణయాప్‌ల కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ సాగుతోంది. వేలకోట్ల రూపాయల దా'రుణాల కేసులో ప్రధాన నిందితులైన లాంబో, నాగరాజు ఐదురోజుల కస్టడీలో భాగంగా.. ఆదివారం పలు కీలక సమాచారం రాబట్టారు. కంపెనీకి చెందిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని..ఆర్థిక లావాదేవీలకు ప్రత్యేకకమిటీ ఉందని లాంబో పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విచారణలో మరికొన్ని యాప్‌లను గుర్తించిన పోలీసులు...అతని వ్యక్తిగత ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.
దా'రుణాల' కేసులో నిందితుల నుంచి కీలక సమాచారం - online loan apps case investigation by ccs police
రుణయాప్‌ల కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు.

దా'రుణ' కేసులో నిందితుల నుంచి కీలక సమాచారం
పరారీలో ఉన్న జెన్నీఫర్ అనే మహిళ నకిలీపేరుతో భారత్‌కు వచ్చి వెళ్లేదని తేల్చారు. కేసుకు సంబంధించి ఇవాళ సైతం నాగరాజను విచారించనున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.
- ఇదీ చూడండి :వైరల్: చేయిచేయి కలిపి.. ట్రక్కును బయటకు తీసి..