ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద హత్యకు గురైన స్నేహలతకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటపడ్డాయి. యువతి పని చేస్తున్న ధర్మవరం స్టేట్ బ్యాంకు నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్నేహలత హత్య కేసులో బయటికొచ్చిన సీసీ దృశ్యాలు - ధర్మవరంలో బ్యాంకు ఉద్యోగి హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేహలత హత్య కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బయటికి వచ్చాయి. యువతి పని చేస్తున్న బ్యాంకు నుంచి బయటకు వస్తున్న చిత్రాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
స్నేహలత హత్య కేసులో బయటికొచ్చిన సీసీ దృశ్యాలు
స్నేహలతను హత్య చేసిన నిందితుడు రాజేష్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ధర్మవరం గ్రామీణ పోలీసులు... అతడిని విచారణ చేస్తున్నారు. స్నేహలత ఫోన్ ఎక్కడ దాచాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:పగ.. పన్నాగం.. డేటింగ్ వెబ్సైట్లో మహిళ వివరాలు