సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ట్రాక్టర్లలోని బ్యాటరీ, డీజిల్ దొంగిలించిన నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం రోజున పెంచికల్పేట గ్రామానికి సంబంధించిన రైతుల ట్రాక్టర్లలోని బ్యాటరీ, డీజిల్, టేపిరికార్డర్స్ని దుండగులు దొంగిలించారు. గమనించిన రైతులు కమాన్పూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఓయ్.. దొంగ సీసీ కెమెరాకు చిక్కాడోయ్! - peddapally tracter thief news latest
"ఓయ్" పట్టించింది. అదీ సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా..! ఇంతకీ ఏంటా ఓయ్..? దేన్ని పట్టించింది..? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి..!
ఓయ్..! సీసీ కెమెరా పట్టించింది
పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి దగ్గరలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆ ప్రాతంలో ఒక ఆటో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. దాని వెనుక భాగంలో “ఓయ్” అనే పదం ఉంది. దాని ఆధారంగా విచారించిన పోలీసులు.. నిందితున్ని పట్టుకున్నారు. ఎందుకోసం ఆ పేరు పెట్టుకున్నాడో తెలియదు గాని.. ఓయ్అని పిలిచిమరీ ఆటో యజమానిని పోలీసులకు పట్టించింది.