ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు రూ.4.92 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పంజాగుట్ట, ఉస్మానియా, గోల్కొండ, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ నగదు పట్టుబడిందన్నారు. అనధికార నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలో రూ 34.30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి నుంచి ఎస్సార్‌నగర్‌లో రూ. కోటి, నల్గొండకు అనధికారికంగా తరలిస్తుండగా రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. నగదు తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.
నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి: హైదరాబాద్ సీపీ - undefined
హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు రూ.4.92 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అనధికార నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
![నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి: హైదరాబాద్ సీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2930084-thumbnail-3x2-cp.jpg)
సీపీ అంజనీ కుమార్