బంజారాహిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. రోడ్డు నంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైంది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వాళ్లు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం రూ.3కోట్ల 20లక్షలు బయటపడింది. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు నగదును తరలించారు.
పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత
ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్‌లో రూ.3.20 కోట్లు లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు... వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత
అబిడ్స్‌లో ఉండే బంగారు నగల వ్యాపారి అనిల్ అగర్వాల్‌కు చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారానికి సంబంధించిన సొమ్మా లేకపోతే హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న నగదా... అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆభరణాల వ్యాపారికి రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: ఆదిలాబాద్‌లో చోరీ... 15 తులాల పసిడి మాయం