తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ - మల్లారెడ్డిపై భూకబ్జా కేసు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తనకున్న భూమిని అమ్మాలంటూ మంత్రి బెదిరిస్తున్నారని... ఇప్పటికే కొంత స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడ సైతం నిర్మించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మేడ్చల్​ జిల్లా దుండిగల్​ పీఎస్​లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

case registered on minister mallareddy in dundigal police station
case registered on minister mallareddy in dundigal police station

By

Published : Dec 8, 2020, 10:22 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్​ పోలీస్​స్టేషన్​లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండలం సురారం సర్వే నెం 115, 116, 117 లోని తన భూమిని అమ్మాలంటూ... మంత్రి మల్లారెడ్డి బెదిరిస్తున్నారని శ్యామల దేవి ఫిర్యాదు చేశారు. తనకున్న 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటలు కబ్జా చేసి.. ప్రహరీ గోడ నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కోర్టులో దావా వేయడానికి నియమించుకున్న లాయర్ లక్ష్మీనారాయణ సైతం మంత్రితో కుమ్మక్కై.. నకిలీ అగ్రిమెంట్ సృష్టించారని బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు... భూకబ్జా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కట్నం వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details