హైదరాబాద్ చంద్రాయణగుట్టలోని కేషవగిరికి చెందిన ఆర్షద్, నవాజ్‌తోపాటు కొందరిపై హుస్సేన్ అనే వ్యక్తి అక్రమంగా కేసు పెట్టించాడు. ఈ కేసు రాజీకి భారీగా నగదు ఇవ్వాలని.. లేదంటే మరిన్ని కేసులు పెట్టిస్తానని బెదిరించాడని బాధితులు తెలిపారు. తనకు పోలీస్ ఉన్నత అధికారులు తెలుసునని వారితో దిగిన ఫొటోలు చూపించాడని చెప్పారు.
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు - etv bharath
పోలీస్ ఉన్నత అధికారులతో ఉన్న ఫొటోలు చూపించి, వారితో పరిచయాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై హైదరాబాద్ చంద్రాయనగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రుద్ర భాస్కర్ చెప్పారు.
police
బాధితుల ఫిర్యాదుతో హుస్సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం హుస్సేన్ అతని తండ్రి, సోదరుడిని కొడుతుంటే అడ్డుకున్నందుకు తమపై అక్రమ కేసులు పెట్టాడని బాధితులు వాపోయారు. ఈ విషయమై చంద్రాయణగుట్ట సీఐ రుద్ర భాస్కర్‌ను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వైద్యుని ఇంట్లో చోరీ.. రూ.2.4 లక్షలు అపహరణ