రుణాల పేరిట బ్యాంకును మోసం చేసిన అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్‌పై సీబీఐలో కేసు నమోదైంది. కంపెనీతో పాటు ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు, ప్రమోటర్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డిపై బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ నేరాల విభాగంలో కేసు నమోదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలు ఉత్పత్తి చేసే ఈ సంస్థ హైదరాబాద్, మెదక్, పశ్చిమగోదావరి, కర్ణాటకలోని హూడీలో యూనిట్లు నిర్వహిస్తోంది.
బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్‌పై సీబీఐలో కేసు నమోదు
హైదరాబాద్‌కు చెందిన సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్‌పై సీబీఐలో కేసు నమోదైంది. రుణాల పేరిట బ్యాంకును మోసం చేసిన అభియోగంపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు రూ. 95 కోట్ల నష్టం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపింది.
బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్‌పై సీబీఐలో కేసు నమోదు
సర్వో మాక్స్ తప్పుడు పత్రాలు, పూచీకత్తులతో 2013 నుంచి 2017 మధ్య మోసానికి పాల్పడ్డారని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు రూ. 95 కోట్ల నష్టం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసిన సీబీఐ.. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది.