మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ మహిళకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. నర్సింగ్ హోమ్ వైద్యాధికారి వైదేహిని మందలించారు. జిల్లాలో ఏ ఆసుపత్రికి లింగ నిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి చేసే అధికారం లేదని, అవసరమైన సమయంలో అనుమతులు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చట్టవిరుద్ధంగా అబార్షన్.. ఆసుపత్రిపై కేసు నమోదు.. - abortion cases in Mahabubabad district
చట్టవిరుద్ధంగా ఓ మహిళకు అబార్షన్ చేస్తున్నారన్న సమాచారంతో మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఏ ఆసుపత్రికి లింగ నిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి చేసే అధికారం లేదని జిల్లావైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ స్పష్టం చేశారు.

జిల్లాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య 901కి పడిపోవడం వల్ల జిల్లాలోని నర్సింగ్ హోమ్‌లపై అధికారులు దృష్టి సారించారు. చిన్న గూడూరు మండలం మంగోరు గూడెం తండాకు చెందిన ఓ మహిళకు మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. రెండోసారి గర్భవతి అయిన ఆమె.. మహబూబాబాద్ పట్టణం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగనిర్ధారణ పరీక్ష చేయించుకుంది. మళ్లీ ఆడపిల్ల అని తెలియగా.. అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత, జిల్లా బాలల పరిరక్షణ సమితి ప్రతినిధులు వీరన్న, నరేష్, ఐసీడీఎస్ అధికారిణి ఉష, ఎస్ఐ మురళీధర రాజు .. నర్సింగ్ హోమ్‌పై దాడి చేసి కేసు నమోదు చేశారు.
- ఇదీ చూడండి :మహిళ దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం..!