తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'నామినేటేడ్​ పదవులు ఇప్పిస్తామని మోసం చేశారు' - undefined

భాజపా నేత మురళీధర్​రావు చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో ఆయనపై కేసు నమోదైంది. 2015 నుంచి కేంద్రంలో నామినేటేడ్​ పదవులు ఇప్పిస్తామని మురళీధర్​ రావు మనుషులుగా చెప్పుకుని రూ.2 కోట్ల 17 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ప్రవర్ణారెడ్డి ఆరోపించారు.

'నామినేటేడ్​ పదవులు ఇప్పిస్తామని మోసం చేశారు'

By

Published : Mar 27, 2019, 8:03 PM IST

'నామినేటేడ్​ పదవులు ఇప్పిస్తామని మోసం చేశారు'
కేంద్రంలో నామినేటెడ్​ పోస్టు ఇప్పిస్తామని ప్రవర్ణారెడ్డి దంపతుల నుంచి నగదు వసూలు చేశారనే ఫిర్యాదుపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు, మరో 8 మందిపై కేసు నమోదైంది. బాధితురాలు ప్రవర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సరూర్​నగర్ పోలీస్​స్టేషన్​లో 9మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఔషధ రంగంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని నాలుగేళ్ల క్రితం ఈశ్వర్ రెడ్డి, కృష్ణకుమార్, రాంచంద్రారెడ్డి తమ వద్ద నుంచి రూ. 2కోట్ల 17 లక్షలు తీసుకున్నారని బాధితురాలు తెలిపారు. విషయాన్ని గమనించి 2016లో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా భాజపా నేత మురళీధర్​రావుతో పాటు మరికొంత మంది కలిసి బెదిరింపులకు దిగినట్లు వెల్లడించారు. రూ. 2కోట్ల 5లక్షలు తిరిగి చెల్లించడానికి అంగీకరించి... తరువాత ఇవ్వకుండా మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 సెప్టెంబర్​లో డబ్బుల విషయమై దిల్లీలో కేసు నమోదైనప్పటికి ఫలితం లేదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details