తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు.. - తెలంగాణ వార్తలు

నిజామాబాద్​ జిల్లాలో దొంగలు కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు. మూడున్నర నిమిషాల్లోనే తీసుకెళ్లారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

car-theft-at-dichpally-in-nizamabad
కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు!

By

Published : Dec 23, 2020, 1:32 PM IST

నిజామాబాద్ జిల్లాలో కారు దొంగతనం జరిగింది. దొంగలు కారులో వచ్చి మరో కారును దొంగిలించారు. డిచ్‌పల్లిలో మండల కేంద్రంలో బండి జ్ఞానేశ్వర్​ తన కారును ఇంటిముందు పార్కింగ్ చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో కారును తీసుకెళ్లారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును చోరీ చేస్తుండగా నమోదైన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:లారీ టైరు పగిలి... 120 పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి

ABOUT THE AUTHOR

...view details