రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ పిల్లర్ నెంబర్ 170 వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా కారు బోల్తా పడింది. ప్రమాదంలో హర్ష అగర్వాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు - రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌పై ప్రమాదం వార్తలు
అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు
క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతనెల ఇదే ఫ్లైఓవర్‌పై అతివేగంతో వెళ్తున్న కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయడం గమనార్హం.