తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీ కొట్టిన కారు.. ఏఎస్సై మృతి - ఉట్నూర్

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఉట్నూర్ పోలీస్​స్టేషన్​లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి మృతి చెందారు.

car hits the bike .. asi died in adilabad neradigonda
బైక్​ను ఢీ కొట్టిన కారు.. ఏఎస్సై మృతి

By

Published : Jan 24, 2021, 7:21 PM IST

వేగంగా వచ్చిన ఓ కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉట్నూర్ పోలీస్​స్టేషన్​లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న డేవిడ్.. ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నేరడిగొండ నుంచి భార్యతో కలిసి బుల్లెట్ వాహనంపై నిర్మల్ వైపున​కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డేవిడ్​ తలకు తీవ్ర గాయమైంది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిన డేవిడ్..​ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టోల్ ప్లాజా వద్ద బైక్​ను ఢీ కొట్టిన వాహనం.. హైదరాబాద్ వైపునకు వెళ్లినట్లుగా గుర్తించి, గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:స్నేహితులు దూరం అవుతారని విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details