ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం చౌత్రా సెంటర్లో ద్విచక్రవాహనంపై తండ్రి కుమారులిద్దరు టైలర్ దుకాణానికి వెళ్లారు. వర్షం పడుతున్న కారణంగా.. కుమారుడని ద్విచక్ర వాహనంపైనే ఉండాలని చెప్పిన తండ్రి దుకాణంలోకి వెళ్లాడు. అదే సమయంలో.. మరో వాహనం ఎదురుగా రావడంతో అటుగా వచ్చే కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
బైక్ను ఢీ కొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వాహనదారుడు - చిలకలూరిపేటలో బైకును ఢీకొన్న కారు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం చౌత్రా సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. రహదారిపై నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి కొద్దిదూరం నెట్టుకుంటూ వచ్చింది. వాహనంపై ఉన్న వ్యక్తి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో నమోదైంది.
![బైక్ను ఢీ కొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వాహనదారుడు car-hits-bike-in-chilakaluripeta-at-guntur-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8791292-744-8791292-1600045889948.jpg)
బైక్ను ఢీ కొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వాహనదారుడు
డ్రైవర్ సరిగా గమనించని కారణంగా.. కారుతో పాటే కొద్ది దూరం వాహనం ముందుకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనంపై ఉన్న కుమారుడు పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాద దృశ్యాలు పక్కనే దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
బైక్ను ఢీ కొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వాహనదారుడు
ఇదీ చదవండి:ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు సెల్ఫీ సూసైడ్