సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఖిల్ అనే వ్యక్తి మద్యం సేవించి కారు నడిపాడు. అతి వేగంతో డివైడర్‌ను ఢీకొట్టి పైకి ఎగిరి... అవతలి వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఇద్దరు కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారిని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
డివైడర్‌ను దాటి... గాల్లో ఎగిరి... బైక్‌ను ఢీకొట్టింది - కారు బీభత్సం
అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్‌ను దాటి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన వెస్ట్‌మారేడుపల్లిలో చోటు చేసుకుంది. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను దాటి... గాల్లో ఎగిరి... బైక్‌ను ఢీకొట్టింది