రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు గేట్ వద్ద ఓ కారు ఢీ కొట్టింది. ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామస్థులుగా గుర్తించారు.
అంబులెన్స్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం - కందుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం
అంబులెన్స్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తుర్ గేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అంబులెన్స్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి:సుప్రీంకోర్టు, హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు