హైదరాబాద్లో ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి అతివేగంగా.. దూసుకొచ్చిన TS 13 UA 7633 కారు.. చైతన్యపురి యూటర్న్ వద్ద రోడ్డు దాటుతున్న రవి, ధన్రాజ్ అనే ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - two dead in a car accident near lb nagar
ఎల్బీనగర్- దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న ఇద్దరిని అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనగా వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
ఘటన తర్వాత మృతులను ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు