ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో డ్రైవర్‌తో పాటు దంపతులు ఉన్నారు. కారు వెనుక భాగంలో దట్టమైన పొగ వ్యాపిస్తున్న సమయంలో.. గమనించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వారిని అప్రమత్తం చేశారు.
కారులో చెలరేగిన మంటలు... ప్రయాణికులు సురక్షితం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ కారులో మంటలో చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదంలో కారు దగ్ధం...ప్రయాణికులు సురక్షితం
కారులో ఉన్న ముగ్గురు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.