తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గణేశ్ నిమజ్జనానికి వెళితే.. కారు కాలిపోయింది! - వినాయకుని నిమజ్జనంలో కాలిపోయిన కారు

ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్నాడు. ఎందుకు వేగంగా వెళ్తున్నావని వారసిగూడకు చెందిన అరుణ్ అతని స్నేహితులు సాయి, సంతోష్ ఆడిగినదుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇరువురు కొట్టుకుంటూ ఉండగానే స్కార్పియో కారుకు మంటలు అంటుకుని కాలిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్​పై సోమవారం తెల్లవారుజామున జరిగింది.

car fire accident at hyderabad
వినాయకుని నిమజ్జనం కోసం వెళ్తే.. మధ్యలో కారు కాలిపోయింది..

By

Published : Aug 31, 2020, 2:20 PM IST

హైదరాబాద్​ వారసిగూడ పార్సిగుట్టకు చెందిన అరుణ్​కుమార్ తన స్నేహితులు సాయి, సంతోష్, కిరణ్​తో కలిసి ట్యాంక్ బండ్​లో వినాయక నిమజ్జనం చేయడానికి స్కార్పియో కారులో వచ్చారు. చిల్డ్రన్ పార్క్ సమీపం వద్దకు రాగానే వెనుక నుంచి ద్విచక్రవాహనం వేగంగా వస్తోంది. ఆయన స్నేహితులు వారిని మందలించారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

అంతలోనే ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు వారి స్నేహితులకు ఫోన్ చేయడంతో... మరో వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీరితో గొడవ పడ్డారు. అదే సమయంలోనే స్కార్పియో కారులో మంటలు అంటుకుని కాలిపోయింది. దీంతో అరుణ్ స్థానిక గాంధీ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ గొడవలో ద్విచక్ర వాహనంపై వచ్చిన పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో... సంతోష్, కిరణ్​కు గాయాలయ్యాయి. అయితే గొడవ జరుగుతున్న సమయంలో కారును గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారా... లేదా ప్రమాదవశాత్తు జరిగిందా... అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వినాయకుని నిమజ్జనం కోసం వెళ్తే.. మధ్యలో కారు కాలిపోయింది..

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details