తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

టైరు పగిలి లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి - సంకలమద్ది స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు ముందు టైరు పగిలి... నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేట మండలం సంకలమద్ది స్టేజి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

car dashed standing lorry at sankalamaddi stage and two people died
టైరు పగిలి లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

By

Published : Nov 9, 2020, 4:25 PM IST

మహబూబ్​నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్ది సమీపంలో 44వ నాలుగో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు టైరు పగిలి నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని... మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్​ వాసిగా గుర్తించారు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:మందుపాతరను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

ABOUT THE AUTHOR

...view details