పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి మండలంలోని పురపాలికకు చెందిన స్వాగత తోరణాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొంది. ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నిద్ర మత్తులో స్వాగత తోరణాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - పెద్ద కల్వల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
నిద్ర మత్తులో కారు నడుపుతూ స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
నిద్ర మత్తులో స్వాగత తోరణాన్ని ఢీ.. ఒకరు మృతి
క్షతగాత్రులను ప్రయాణికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:రీఛార్జ్ చేసుకోమన్నారు.. డబ్బు కాజేశారు...