వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట-ఫాతిమా వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి హన్మకొండకు అతివేగంగా వస్తున్న కారు.. వంతెన ఎక్కుతుండగా అదుపుతప్పి ఫుట్‌పాత్ పట్టీలకు బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న వడ్డేపల్లికి చెందిన రోహిత్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు.
అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి - వరంగల్ ఫాతిమా వంతెన లేటెస్ట్ వార్తలు
హైదరాబాద్ నుంచి వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు వెళ్తున్న కారు... కాజీపేట ఫాతిమా వంతెన ఎక్కుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
కారులో పక్కనే కూర్చున్న మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. కాజీపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.