పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులో సోమవారం రాత్రి రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓకారు విద్యుత్ఘాతం సంభవించి అగ్నికి ఆహుతైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి కరీంనగర్ మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు సుల్తానాబాద్ వద్దకు రాగానే కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు కారును వదిలేసి కొంత దూరం పారిపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.
కారులో ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. దగ్ధమైన వాహనం - కారు దగ్ధం వార్తలు సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూరు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు.. సుల్తానాబాద్ వద్దకు రాగానే ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణీకులు కారు నుంచి క్షణాల్లో బయటపడ్డారు. అందరూ చూస్తుండగానే కారులో భారీగా మంటలు ఎగిసి పూర్తిగా దగ్ధమైంది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన సర్పంచ్ భర్త సాగర్‌తోపాటు విన్నర్ బాబు, ప్రవీణ్, బాలాజీ అనే యువకులు వారి బంధువుల పెద్దకర్మకు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కాస్త ఆలస్యమయితే పెట్రోల్ ట్యాంక్ పేలి ఉండేది. దీంతో పెను ప్రమాదం తప్పింది. నలుగురు యువకులు ప్రమాదం నుంచి తప్పించుకోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:రెండు ద్విచక్రవాహనలు ఢీ.. ఇద్దరు మృతి