తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం - car burned in fire accident in suryapeta district

ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘటన చోటుచేసుకుంది.

car burned in fire accident in suryapeta district  at Akupamula village
క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం

By

Published : Dec 19, 2020, 7:21 PM IST

అప్పటిదాకా వేగంతో దూసుకెళ్తున్న కారు ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో ఈ ప్రమాదం జరిగింది.

క్షణాల్లో కారు బూడిద...తృటిలో తప్పిన ప్రాణాపాయం

గుంటూరు జిల్లా రేపల్లె నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా కారు అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు ముందుభాగం పూర్తిగా కాలి బూడిదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:బీజాపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలంటే.. గుండె బేజారే!

ABOUT THE AUTHOR

...view details