తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారు, ద్విచక్ర వాహనం ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు - సూర్యాపేట లేటెస్ట్ వార్తలు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని రెడ్డిగూడెం స్టేజి వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పొలం నుంచి ఇంటికి వస్తున్న వెంకన్న అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనని సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

car bike accident at maddirala in suryapet district
కారు, ద్విచక్ర వాహనం ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు

By

Published : Oct 31, 2020, 8:34 AM IST

సూర్యాపేట జిల్లాలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం స్టేజి వద్ద శుక్రవారం సాయంత్రం కటకం వెంకన్న అనే వ్యక్తి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

తుంగతుర్తి నుంచి మద్దిరాల వైపు అతి వేగంతో వస్తున్న కారు ఢీకొనడంతో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం ఆయనని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి

ABOUT THE AUTHOR

...view details