ఏపీ గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణ మఠం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురు వ్యక్తులు కారులో నిజాంపట్నంలో పెళ్లి వేడుకకు వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
పెళ్లికి వచ్చి... తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకానికెళ్లారు - నిజాంపట్నంలో రోడ్డు ప్రమాదం వార్తలు
వారు ముగ్గురూ పెళ్లి వేడుక కోసం వచ్చారు. వివాహం కార్యక్రమం ముగియగానే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒక్కసారిగా కారు అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లగా.. ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గోకర్ణమఠం వద్ద జరిగింది.
![పెళ్లికి వచ్చి... తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకానికెళ్లారు car-accident-two-died-in-nijampatnam-guntur-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8226225-422-8226225-1596080961718.jpg)
పెళ్లికి వచ్చి... తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకానికెళ్లారు
స్థానికులు వారిలో ఒకరిని కాపాడారు. మరో ఇద్దరు ఊపిరాడక మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్ని కర్లపాలెం మండలానికి చెందిన సాంబశివరావు, రాజేంద్రగా గుర్తించారు. మృతదేహాలను రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.