సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద కారు అదుపు తప్పింది. జహీరాబాద్ - బీదర్ మార్గంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు తెల్లవారుజామున అదుపుతప్పి... హోటల్లోకి దూసుకెళ్లింది.
హోటల్లోకి దూసుకెళ్లిన కారు... తప్పిన ప్రాణాపాయం - కారు ప్రమాదం వార్తలు
ఓ కారు అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన ఘటన కొత్తూరులో చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో కారులో నలుగురు ఉండగా... అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
హోటల్లోకి దూసుకెళ్లిన కారు... తప్పిన ప్రాణాపాయం
కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు ఉండగా.. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెల్లవారుజాము కావడం.. హోటల్ తెరవకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి:వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు