నీటి కుంటలో కారు పడి.. బాలిక మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా.. ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కా, తమ్ముడు కారుణ్య(9), కౌశిక్‌ను... బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు.
నీటికుంటలో పడిపోయిన కారు.. చిన్నారి మృతి - కర్నూలు జిల్లా ప్రమాదాలు
కారు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తమ్ముడు, బాబాయితో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా గుత్తి సమీపంలో చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.
కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు.